![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1124 లో... వసుధారని తన ఇంటి దగ్గర దింపడానికి రంగా వస్తాడు. ఇద్దరు కొద్దీ దూరం నడుచుకుంటూ వెళ్తారు. ఎటువైపు మీ ఇల్లు అని రంగా అనగానే.. మీకు తెలియదా అని వసుధార అంటుంది. లేదని రంగా అంటాడు. అటు వైపు అంటు వసుధార అనగానే కాదు ఇటు వైపు అనుకుంటా అని రంగా అంటాడు. దాంతో వసుధార ఆశ్చర్యంగా.. మీరు రిషి సర్ కాకపోతే మీకెలా తెలుసని అంటుంది. నాకేం తెలుసు మీరేదో కన్ ఫ్యూజన్ లో ఉన్నారని చెప్పానని రంగా అంటాడు.
ఆ తర్వాత వసుధార, రంగా ఇద్దరు ఇంటికి వస్తారు. వాళ్ళు వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. అది చూసి మీ వాళ్ళు ఉంటే నిన్ను వాళ్ళకి అప్పగించి వెళదామని అనుకున్న.. సరే నేను వెళ్తున్నానని రంగా అంటాడు. సర్ మీరు నా రిషి సర్ అని వసుధార అంటుంది. అయినా కూడా నేను రంగా అంటూ వెళ్ళిపోతుంటాడు. మరొక వైపు దేవయాని దగ్గరికి అనుపమ వస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావని దేవయానిని అనుపమ అడుగుతుంది. నేనేం చేసానని దేవయాని అంటుంది. వేరే ఎవరితోనో బ్లాక్ మెయిల్ చేపిస్తున్నావని అనుపమ అంటుంది. అవును నేనే అని దేవయాని అంటుంది. నిజమే కదా మను తండ్రి మహేంద్రనే కదా అని దేవయాని అనగానే అనుపమ షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావని అనుపమ కోప్పడుతుంది. ఉండు సాక్ష్యం తీసుకొని వస్తానంటూ దేవయాని వెళ్లి.. వసుధార రాసిన లెటర్ తీసుకొని వచ్చి అనుపమకి ఇస్తుంది. అనుపమ అది చదివి టెన్షన్ పడుతుంది. ఈ విషయం ఎవరికి చెప్పకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అలా చెప్పకుండా ఉండాలి అంటే నీ కొడుకు ఎండీ సీట్ కి అడ్డురాకూడదు.. నువ్వు నీ కొడుకుని తీసుకొని ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోమని దేవయాని అనగానే.. సరే వెళ్ళిపోతానని అనుపమ అంటుంది.
మరొకవైపు రంగా వెళ్ళిపోయినందుకు వసుధార ఏడుస్తుంది. మావయ్య గారు ఉండి ఉంటే కచ్చితంగా రిషి సర్ బయటపడేవారు. అప్పుడే ఎవరి ఫోన్ నుండి అయిన మావయ్య గారికి చేసి.. రిషి సర్ గురించి చెప్పి ఉంటే బాగుండని వసుధార అనుకుంటూ వస్తుంటే.. అటు వైపే శైలేంద్ర వెళ్తుంటాడు. కానీ వసుధారని చూడడు. రౌడీ లు మళ్ళీ వసుధారని కిడ్నాప్ చేస్తారు. ఈ సారి మిస్ చెయ్యొద్దని రౌడీలు వసుధారని చంపాలని అనుకుంటారు. అప్పుడే రంగా వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |